Tuesday, March 17, 2009
జి.డి.ఎస్ పే కమిటీ అమలుకై
జరుగుచున్న ప్రయత్నాలలో పురోగతి :
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ అందజేసిన వివరాలు :
సుమారు గత నెల రోజుల నుండి జి.డి.ఎస్ పే కమిటీ అమలుకు
ప్రతిపాదనలతో పంపిన ఫైల్ ఆర్ధిక సంబంధ శాఖ (జే.ఎస్.& ఎఫ్. ఎ )
వద్ద పెండింగ్ లో వున్నవిషయం తెలిసినదే. గత శుక్ర వారము సంబంధిత
ఫైల్ అక్కడనుండి తపాల శాఖ కార్యదర్శి (పి) వద్దకు వచ్చినట్లు తెలిసినది.
తపాల శాఖ వద్ద నుండి త్వరలో కేంద్ర కమ్యూని కేశన్ల శాఖ మంత్రి గారి
అనుమతి కొరకు తదుపరి ఆర్ధిక మంత్రి వద్దకు వెళ్ళే అవకాశం వుంది.
ఫెడరేషన్ కు అందిన సమాచారము మేరకు :--
గ్రాత్యుటి రూ.75,000/- కు పెంచబడినది.
టి. ఆర్.సి.ఎ స్కేలు యించుమించు శ్రీ గోపినాద్ కమిటీ సిఫారసుల మేరకు వుంటాయి.
కాని బి.పి.ఎం లకు 5 స్టేజెస్, యితర జి.డి.ఎస్ లకు ౨స్టేజెస్, కొత్తగా చేరిన వారికి ౩ స్టేజెస్ వుంటాయి.
ఇంక్రిమెంట్ 2% వుంటుంది.
బి.పి.ఎం లకు యిచ్చే ఓ.ఎం.ఎ., ఎఫ్.ఎస్.సి విడివిడిగా కాకుండా మొత్తంగా రూ.250/- వుంటుంది.
కంబైండ్ డ్యూటి అలవెన్స్ రూ.500/- వుంటుంది అని తెలియజేశారు. (ఇన్ఫర్మేషన్ మాత్రమె)
దీనిని బట్టి చూస్తే, యూనియన్ల ప్రతిపాదనలను పూర్తిగా పరిగణనలోకి తెస్సుకున్నట్లు లేదని తెలుస్తున్నది.
మరిన్ని మెరుగైన సానుకూల ప్రతిపాదనల అంగీకారము నకు తప్పని సరిగా పోరాట కార్యక్రమాలు చేపట్ట వలసి వుంటుంది.
యితర వివరాలు :
-- నాన్-మేత్రిక్యులేట్ గ్రూప్.డి వుద్యోగులకు హైయ్యర్ పే స్కేల్ మంజూరుకు సంబంధించిన ఫైల్ కు ఆర్ధిక మంత్రిత్వ శాఖ అనుమతి లభించినట్లు తెలుస్తున్నది. ట్రైనింగ్ యితర సంభదిత విషయాలపై దైరేక్తోరేట్ వుత్తరవులు త్వరలో వెలువడ వచ్చును.
-- పోస్ట్ మెన్, గ్రూప్.డి ఖాళీలలో పనిచేస్తున్న పైయిడ్ సబ్ స్టిట్యూట్ లకు హైయ్యర్ పే స్కేల్ మంజూరు కు సంబంధించిన ఫైల్ జే.ఎస్.& ఎఫ్.ఎ వద్ద నుండి క్లియర్ అయినట్లు తెలుస్తున్నది. దీని ప్రకారం మినిమం పే బ్యాండ్ -గ్రేడ్ పే - డి.ఎ లతో కూడిన దినసరి జీతం పైయిడ్ సబ్ స్టిట్యూట్ లకు మంజూరు కావచ్చును. వుత్తరవులు త్వరలో వెలువడ గలవు .
-- పార్ట్ టైం కంటింజేంట్ వుద్యోగుల సమస్య యింకా పెండింగ్ లో వున్నది. దీనిపై ఎన్.ఎఫ్.పి.యి దైరేక్తోరేట్ తో అంశం చేపట్టే ప్రయత్నంలో వున్నది. 16 వ తేది నుండి చేపట్టిన పోరాట కార్య క్రమంలో డిమాండ్ గా చేర్చ బడి వున్నది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment